Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ అస్వస్థతకు గురైన ఘటన తమిళ సినీ పరిశ్రమలో కలకలం రేపింది. విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొన్న విశాల్, వేదికపై ఉండగా ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కుప్పకూలారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే విశాల్‌ను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు చికిత్స అందించారు. ఈ ఘటనపై నెటిజన్లు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆరా తీశారు.
విశాల్ మేనేజర్ క్లారిటీ ఇచ్చారు. మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడం వల్ల విశాల్ అస్వస్థతకు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. డాక్టర్లు సమయానికి ఆహారం తీసుకోవాలని సూచించినట్లు మేనేజర్ వెల్లడించారు. విశాల్ ఆరోగ్యం బాగుందని తెలియడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.