Viral Video: మందు తాగడం.. తాగి వాహనాలు నడపడం.. ఏక్సిడెంట్స్ చేయడం.. ఆనక పోలీసులు పట్టుకుంటే చిందులు తొక్కడం కొంతమందికి ఫ్యాషన్ గా మారిపోయింది. ఫుల్లుగా తాగిన తరువాత మన మాటే మన అదుపులో ఉండదు. మరి కారు ఎలా అదుపులో ఉంటుంది? డ్రైవింగ్ ఎలా చేయగలం అనే చిన్న ఇంగితాన్ని మర్చిపోయి తాగి కార్లు నడుపుతారు. పైగా కొంతమంది మందు మత్తులో కారుతో విన్యాసాలు చేస్తుంటారు. అలా వాళ్ళు చేసే విన్యాసాలకు రోడ్డుపై వెళ్లే వారు బలైపోతారు. ఇదిగో అలంటి సంఘటనే ఛత్తీస్ గఢ్ లో జరిగింది. ఫుల్లుగా తాగి.. కారులో డ్రైవర్ ఒళ్ళో కూచుని ఒక రష్యన్ యువతి యాక్సిడెంట్ చేసింది. ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసులు వచ్చేసరికి ఆమె చేసిన చిందులు చూస్తే మతిపోతుంది.
Viral Video: బుధవారం రాత్రి రాయ్‌పూర్‌లోని వీఐపీ రోడ్డులో వేగంగా వస్తున్న ఇండిగో కారు స్కూటర్‌ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో ఆ యువతి గందరగోళ వాతావరణాన్ని సృష్టించింది. ఆ రష్యన్ యువతి వారితో తీవ్ర వాగ్వాదానికి దిగి, గొడవ సృష్టించింది. అంతేకాకుండా, ఈ యువతి పోలీసులతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లడానికి కూడా నిరాకరించింది.
A speeding car hit three youths riding an Activa at midnight on VIP Road, they have been admitted in critical condition
(It is being told that the Russian girl was driving the car while sitting on the lap of the man) Raipur CG
pic.twitter.com/mR0yT3LvhD— Ghar Ke Kalesh (@gharkekalesh) February 6, 2025
Viral Video: వైరల్ వీడియోలో, ఆ యువతి పోలీసు సిబ్బంది- సంఘటన స్థలంలో గుమిగూడిన ప్రజల ముందు ఏడుస్తూ, కేకలు వేస్తూ కనిపించింది. ఆ యువతి తన ఫోన్ కనిపించడం లేదని అరుస్తూ, పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు ప్రతిఘటించడం కనిపిస్తుంది. “దయచేసి సహకరించండి” అని ఒక పోలీసు అధికారి ఆ యువతితో అంటాడు, కానీ ఆమె మాత్రమే ప్రతిఘటించింది. ఆ పోలీసు అధికారి ఓపికగా ఎంత ప్రయత్నించినా ఆమె రోడ్డుపై చిందులు తొక్కడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.
Viral Video: ఆ యువకుడు – రష్యన్ మహిళ ఇద్దరూ మద్యం తాగి ఉన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ రష్యన్ యువతి డ్రైవర్ ఒడిలో కూర్చుని ఉండటం వల్ల వాహనాన్ని నియంత్రించడం డ్రైవర్ కు అసాధ్యమైందని వారు తెలిపారు. గాయపడిన ముగ్గురిని వెంటనే మేకహారా ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు.
Viral Video: డ్రైవర్ – పర్యాటక వీసాపై భారతదేశానికి వచ్చిన రష్యన్ మహిళ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రైవేట్ వ్యక్తికి చెందిన వాహనంపై “భారత ప్రభుత్వం” అనే ప్లకార్డును ప్రదర్శించడంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కారు యజమాని – రష్యన్ మహిళను కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ కోసం వారిని కస్టడీకి తీసుకోవాలని పోలీసులు కోర్టును అభ్యర్థించారు.

