Viral News:తన గర్లఫ్రెండ్‌ను ఎలాగైనా తాను ఉండే హాస్టల్‌కు తీసుకెళ్లాలనేది అతని కోరిక. ఎలా తీసుకెళ్లాలబ్బా? అని తెగ ఆలోచించాడు. ఓ ఐడియా వచ్చింది. పెద్ద సూట్‌కేస్ కొన్నాడు. ఆ సూట్‌కేసులో ఆ యువతిని చుట్టాడు. ఎంచక్కా హాస్టల్‌లోకి తీసుకెళ్లాడు. తాను ఉండే గదిలోకి తీసుకెళ్తుండగా, సెక్యూరిటీ సిబ్బందికి అనుమానం వచ్చింది. వెంటనే లగేజీని చెక్ చేసేందుకు ఆ సూట్‌కేసును ఓపెన్ చేసేసరికి.. వారి కండ్లు బైర్లు కమ్మే పనైంది.
Viral News:హర్యానా రాష్ట్రంలోని సోనిపట్‌లో ఉన్న ప్రఖ్యాత ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హాస్టల్‌లో ఉండే ఓ యువకుడు సెలవుల్లో ఇంటికి వెళ్లాడు. కాలేజీ హాస్టల్ ఓపెన్ కాగానే వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తనతోపాటు తన ప్రియురాలిని హాస్టల్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
Viral News:దీనికోసం ఓ పెద్ద సూట్‌కేసు కొనుగోలు చేశాడు. అందులో ఆ అమ్మాయిని ప్యాక్ చేశాడు. అదే సూట్‌కేసుతో యూనివర్సిటీ లోపలికి వ్రవేశించాడు. అక్కడి హాస్టల్‌లో ఉండే సెక్యూరిటీ గార్డులకు అనుమానం కలిగింది. ఆపి ఆ లగేజీని చెక్ చేశారు. ఈ క్రమంలో ఆ సూట్‌కేసును తెరవగా లోపల అమ్మాయి కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. వెంటనే సూట్‌కేసులోంచి ఆ యువతిని బయటకు తీశారు.
Viral News:ఆ సమయంలో ఆ హాస్టల్‌లో ఉండే తోటి విద్యార్థులు కొందరు ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. ఈ ఘటనపై ఆ విశ్వవిద్యాలయం యాజమాన్యం ఇంకా స్పందించలేదని తెలిసింది. ఆ విద్యార్థిపై చర్య తీసుకుంటారా? లేక మందలించి వదిలేస్తారా? తెలియాల్సి ఉన్నది. ఈ వీడియోపై సోషల్ మీడియాలో మాత్రం తమదైన శైలిలో నెటిజన్లు స్పందిస్తుండటం గమనార్హం.