Vijayawada Sri kanaka durga temple: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆగస్టు 29 నుంచి నూతన నిబంధనలు అమలులోకి వచ్చాయి. వాస్తవంగా గత రెండు రోజుల క్రితం నుంచే నూతన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ అమలులో కొంత జాప్యం నెలకొన్నది. దీంతో ఈ రోజు నుంచి అమలులోకి తెచ్చారు. ఈ నిబంధనల మేరకు ఆలయానికి వచ్చే భక్తులు, ఆలయంలో విధుల్లో ఉండే సిబ్బంది సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి. అలా వచ్చిన భక్తులకే అమ్మవారి దర్శనం లభిస్తుంది.
Vijayawada Sri kanaka durga temple: అదే విధంగా అమ్మవారి ఆలయ ఆవరణలో సెల్‌ఫోన్ వాడకంపై పూర్తిగా నిషేధం విధించారు. భక్తులే కాకుండా ఆలయ సిబ్బంది కూడా ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. భక్తులు అసభ్యకర దుస్తుల్లో రావడం, లోపల వీడియోలు తీయడం, నెట్టింట్లో వైరల్ చేస్తుండటంపై ఈ కొత్త నిబంధనలను అమలులోకి తెస్తున్నట్టు తెలిసింది.
Vijayawada Sri kanaka durga temple: ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చే వారు కార్యాలయంలో తమ ఫోన్లను డిపాజిట్ చేయాలనే నిబంధన కూడా ఉన్నది. ఆలయ సిబ్బంది తప్పనిసరిగా గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని ఈవో ఆదేశించారు. స్కానింగ్ సెంటర్, టికెట్ కౌంటర్ వద్ద పకడ్బందీగా తనిఖీలు జరుగుతాయని తేల్చి చెప్పారు. ఇకపై డ్రెస్ కోడ్ లేకపోయినా, సెల్‌ఫోన్ తెచ్చే భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని పేర్కొన్నారు.