Kingdom

Kingdom: అందరి చూపు ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్ వైపు!

Kingdom: టాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ ఒకటి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్‌తోనే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌తో అభిమానులను సర్‌ప్రైజ్ చేయనున్నారు.

‘కింగ్‌డమ్’ ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రోమోను ఏప్రిల్ 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజా పోస్టర్‌తో వెల్లడించింది. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బొర్సె రైల్వే స్టేషన్ బెంచ్‌పై కూర్చున్న లుక్ ఆకట్టుకుంటుంది, అయితే వారి ముఖాలు రివీల్ కాలేదు. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ అద్భుతంగా ఉంటుందని, అందరినీ ఆకట్టుకుంటుందని విజయ్ దేవరకొండ ధీమా వ్యక్తం చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం మే 30న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Ponnam Prabhakar: గురుకుల హాస్టల్ వంటగదిని సందర్శించిన మంత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *