Vijay Deverakonda: హీరో విజయ్ దేవరకొండ తాజాగా ఓ వివాదాస్పద అంశంలో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) విచారణను ఎదుర్కొన్నారు. “A23” అనే యాప్‌ను విజయ్ ఒకప్పుడు ప్రమోట్ చేశారు. అదే సమయంలో కొన్ని బెట్టింగ్ యాప్‌లతో కలిపి ఈ యాప్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై క్లారిటీ ఇవ్వడానికి విజయ్ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు.
విజయ్ ఏమన్నారు?
ఈడీ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన విజయ్, తాను ఎలాంటి చట్టవిరుద్ధమైన యాప్‌ను ప్రమోట్ చేయలేదని స్పష్టం చేశారు. “దేశంలో గేమింగ్ యాప్స్, బెట్టింగ్ యాప్స్ అనే రెండు వేర్వేరు రకాల యాప్స్ ఉన్నాయి. నేను A23 అనే గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశాను. ఇది బెట్టింగ్ యాప్ కాదని తేల్చి చెప్పాను” అని చెప్పారు.
గేమింగ్ యాప్ అంటే ఏమిటి?
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, గేమింగ్ యాప్స్ అనేవి చాలా రాష్ట్రాల్లో చట్టబద్ధంగా గుర్తింపు పొందినవని చెప్పారు. ఇవి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ చెల్లించాలి, రిజిస్ట్రేషన్, టాక్స్ వంటి చట్టపరమైన ప్రక్రియలు ఉండాలి. IPL, కబడ్డీ లాంటి క్రీడలకు ఈ యాప్స్ స్పాన్సర్‌లు కూడా అవుతున్నాయని తెలిపారు. A23 యాప్ కూడా ఇలాంటి చట్టబద్ధమైన గేమింగ్ ప్లాట్‌ఫాం అని వివరించారు.
ఇది కూడా చదవండి: Goodachari-2: 6 దేశాలు, 23 సెట్లు, 150+రోజులు..
A23 యాప్ – స్కిల్ ఆధారిత గేమింగ్
విజయ్ వెల్లడించిన వివరాల ప్రకారం, A23 యాప్ స్కిల్ ఆధారిత గేమింగ్ ప్లాట్‌ఫాం. రమ్మీ వంటి గేమ్స్ ఇందులో ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా ఈ గేమ్స్‌ను స్కిల్ ఆధారితంగా గుర్తించింది. ఈ యాప్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం లేదు – ఇది చట్టబద్ధంగా అనుమతి ఉన్న రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉందని చెప్పారు.
అన్ని వివరాలు ఈడీకి సమర్పణ
విజయ్ దేవరకొండ తన బ్యాంక్ లావాదేవీల వివరాలు, కంపెనీతో చేసుకున్న ఒప్పందాలు, పొందిన మొత్తం లీగల్‌గా ఎలా తీసుకున్నారన్న విషయాలను కూడా ఈడీకి సమర్పించారు. “నేను పూర్తిగా పారదర్శకంగా వ్యవహరించాను. చట్టబద్ధమైన గేమింగ్ యాప్‌నే ప్రమోట్ చేశాను” అని చెప్పారు.
గేమింగ్ యాప్స్ ను ఇల్లీగల్ యాప్స్ ను సెపరేట్ చేయాలి
నన్ను పిలిచింది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి కాదు… గేమింగ్ యాప్స్ మీద క్లారిఫికేషన్ కోసం మాత్రమే
కొన్ని రిజిస్టర్డ్ గేమ్ యాప్‌లు ఉన్నాయి.. అవి ఇండియన్ క్రికెట్ టీమ్ కు స్పాన్సర్ గా కూడా ఉన్నాయి – హీరో #VijayDeverakonda pic.twitter.com/ZFrtB3kutP
— s5news (@s5newsoffical) August 6, 2025