Victory Venkatesh: వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా వచ్చే జనవరి 14న పొంగల్ కానుకగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘గోదారి గట్టు..’ సాంగ్ సూపర్ హిట్ అయి చార్ట్ బస్టర్స్ లో చోటు చేసుకుంది.
Victory Venkatesh: ఇప్పుడు వెంకటేశ్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి ‘మీను..’ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది యూనిట్. ‘నా లైఫ్ లో ఉన్న ఆ ప్రేమ పేజీ..’ అంటూ సాగే లిరిక్ తో ఉన్న ఈ పాట ఫ్యామిలీ నేపథ్యంలో రావటంలో పాటు వెంకీ పోలీస్ యూనిఫామ్ లో కనిపించటం ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది.
ఇది కూడా చదవండి: Bharat Ratna: ఇప్పటి వరకు ఆయనకు భారతరత్న ఇవ్వలేదు
Victory Venkatesh: ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించటమే కాదు పాటను ప్రణవి ఆచార్యతో కలసి పాడారు. దిల్ రాజు సమర్పణలో శిరీశ్ నిర్మిస్తున్న ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.