Venkatesh: విక్టరీ వెంకటేష్ – స్టార్ రైటర్ కమ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ల క్రేజీ కాంబో సెట్స్ మీదకెళ్లనుంది. ఆగస్టు 15, స్వాతంత్ర్య దినోత్సవం నాడు పూజా కార్యక్రమాలతో అధికారికంగా ప్రారంభించారు. 20 ఏళ్ల తర్వాత వెంకీ – త్రివిక్రమ్ కలిసి వర్క్ చేస్తున్నారు. వెంకీ 77వ సినిమా ఇది.
Also Read: Faria Abdullah: అదిరిపోయే అందం.. కానీ ఆఫర్లు కరువు!
హారికా – హాసిని బ్యానర్ లో, వెంకీ – త్రివిక్రమ్ సినిమాను.. ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సురేష్ బాబు, నాగవంశీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సూపర్ హిట్ సినిమాలకు త్రివిక్రమ్ స్టోరీ, డైలాగ్స్ రాశారు. సంక్రాంతికి వస్తున్నాం తో సాలిడ్ సూపర్ హిట్ కొట్టిన వెంకీ.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. త్వరలో వెంకీ 77 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.
𝗧𝘄𝗼 𝗼𝗳 𝗧𝗲𝗹𝘂𝗴𝘂 𝗖𝗶𝗻𝗲𝗺𝗮’𝘀 𝗺𝗼𝘀𝘁 𝗹𝗼𝘃𝗲𝗱 𝗻𝗮𝗺𝗲𝘀 @VenkyMama & #Trivikram unite for a tale to cherish for all time ❤️#Venky77 ~ @haarikahassine Production No. 8 – #VenkateshXTrivikram was launched today with blessings and love from near and dear ones 🪔… pic.twitter.com/MWY6UmHanv
— Suresh Productions (@SureshProdns) August 15, 2025