Varun tej - Lavanya Tripathi

Varun tej – Lavanya Tripathi: తండ్రైన వరుణ్ తేజ్‌.. మగబిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి

Varun tej – Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి లావణ్య త్రిపాఠి దంపతులు తల్లిదండ్రులయ్యారు. ఈరోజు (బుధవారం, సెప్టెంబర్ 10) ఉదయం హైదరాబాద్‌లోని రెయిన్‌బో ఆసుపత్రిలో లావణ్య త్రిపాఠి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

ఈ శుభవార్త తెలియగానే మెగాస్టార్ చిరంజీవి “మన శంకరవరప్రసాద్ గారు” సినిమా షూటింగ్ సెట్స్ నుంచి నేరుగా ఆసుపత్రికి చేరుకున్నారు. వరుణ్, లావణ్యలను పరామర్శించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా మెగా కుటుంబంలోకి వచ్చిన వారసుడిని చూసి చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: Nayanthara: కొత్త చిక్కుల్లో నటి నయనతార

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రేమ ప్రయాణాన్ని ‘మిస్టర్’ సినిమాతో మొదలుపెట్టారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది, ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత ‘అంతరిక్షం 9000 KMPH’ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. గత ఏడాది నవంబర్ 1న ఇటలీలోని టస్కానీలో వీరి వివాహం వైభవంగా జరిగింది. తాజాగా, వీరిద్దరూ తల్లిదండ్రులైన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంతోషకరమైన సందర్భం మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని ఇచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Balakrishna: నందమూరి బాలకృష్ణ గొప్ప మనసు: తెలంగాణ వరద బాధితులకు రూ.50 లక్షల విరాళం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *