Game Changer: రామ్ చరణ్, శంకర్ తో దిల్ రాజు రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీ టీజర్ ను నవంబర్ 9న విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా టీజర్ రిలీజ్ అనౌన్స్మెంట్ ను పోస్టర్ ద్వారా తెలియచేసింది యూనిట్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పోస్టర్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సినిమాలో ట్రైన్ ఫైట్ ఉంటుందని, ఆ ఫైట్ అందరి అంచనాలను మించేలా ఉంటుందన్నాడు. ఇప్పటికే ‘జరగండి జరగండి..’, ‘రా మచ్చా మచ్చా’ సాంగ్స్కు మంచి స్పందన లభించిన నేపథ్యంలో మెగాభిమానులు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ను AA ఫిల్మ్స్ ఫ్యాన్సీ రేటుకి సొంతం చేసుకోవడం విశేషం. మరి కుమారుడికి చోటిస్తూ తన సినిమా ‘విశ్వంభర’ రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకున్న చిరంజీవికి కానుకగా ‘గేమ్ ఛేంజర్’ యూనిట్ బ్లాక్ బస్టర్ ను కానుకగా ఇస్తుందేమో చూడాలి.