నేషనల్ క్రష్ రష్మిక మందనా తన దీపావళి వేడుకను కాబోయే అత్తవారింట్లో చేసుకుందా అంటే అవుననే అంటున్నారు నెటిజన్స్. తాజాగా దీపావళి ఫెస్టివల్ సందర్భంగా రష్మికా.. సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంది. అయితే “ఈ ఫోటోస్ క్రెడిట్స్ ఆనంద్ దేవరకొండ అని థాంక్ యూ ఆనంది” అంటూ రాసుకొచ్చింది. దీంతో ఈ అమ్మడు ఈ దీపావళిని కూడా ప్రియుడు విజయ్ దేవరకొండా ఇంట్లోనే జరుపుకుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక రష్మీక షేర్ చేసిన ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతేడాది కూడా విజయ్ ఇంట్లోనే దీపావళిని సెలబ్రేట్ చేసుకున్నట్లు.. అప్పుడు ఆమె షేర్ చేసిన ఫోటోల్లో తెలిసిపోయింది. అంతకుముందు వీరిద్దరూ హాలిడే ట్రిప్స్ కూడా వేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను విజయ్, రష్మిక తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేయగా.. వీరిద్దరూ దిగిన ఫోటోలు ఒకే లొకేషన్ లో దిగినవేనని.. వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేశారు.
తాజాగా మరోసారి రష్మిక దొరికిపోయిందంటూ ఫోటోలు వైరల్ చేస్తున్నారు.కాగా, వీరిద్దరూ కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్స్ సినిమాల్లో నటించారు. అప్పటి నుంచి వీరు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక రష్మిక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమా చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.బాలీవుడ్ లోనూ రెండు చిత్రాల్లో నటిస్తుంది అ అమ్మడు.