Sankranthiki Vasthunam: వెంకటేశ్, అనిల్ రావిపూడి, దిల్ రాజుది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఇప్పటి వరకూ వీరి కలయికలో వచ్చిన ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ చక్కటి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం జోడీ కట్టిన ఈ కాంబో తమ సినిమాకు అనుకున్నట్లుగానే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ ని ఖరారు చేశారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు. ఇది ఎంటర్ టైన్ మెంట్ ని అందిస్తూనే క్రైమ్ థ్రిల్లర్ గా అలరించనుందట. సంక్రాంతికి వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది యూనిట్. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే తమ సినిమా సంక్రాంతికి వస్తుందని సింబాలిక్ గా ముగ్గుతో, అలాగే క్రైమ్ థ్రిల్లర్ అనే విషయాన్ని తుపాకి తో పాటు ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ని చూపించటం ద్వారా తెలియచేశారు. ఇక ఈ పోస్టర్ లో ఐశ్వర్యరాజేశ్ సంప్రదాయబద్దంగా కనపిస్తుండగా, మీనాక్షి చౌదరి మోడ్రన్ లుక్ తో ఉన్నారు. మొత్తం మీద ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే క్యూరియాసిటీని పెంచిన వెంకీ అండ్ కో సినిమాతోనూ ఆకట్టుకుంటారని ఆశిద్దాం.