Ziaur Rahman Barq: ఒక సాధారణ వ్యక్తి.. ఒక్క గదిలో నివాసం ఉంటున్నదనుకుందాం. అప్పుడు అతనికి కరెంట్ బిల్లు ఎంత వస్తుంది. నెలకు కనీసం 150-200 రూపాయల వరకూ వచ్చే అవకాశం ఉంది కదా. కానీ ఒక ఎంపీగారికి నెలంతా కరెంటు వాడినా.. కనీసం ఒక్క రూపాయి కూడా బిల్లు రాలేదు. దీంతో అధికారులకు అనుమానం వచ్చి చెక్ చేశారు. జరిగింది.. జరుగుతున్నది తెలుసుకుని అవాక్కయ్యారు. వెంటనే సదరు ఎంపీ మీద కేసు నమోదు చేశారు. అసలు స్టోరీ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ సంభాల్‌లో ఎస్పీ ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కేపై విద్యుత్ చౌర్యం కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గురువారం ఉదయం 7 గంటలకు విద్యుత్ శాఖ బృందంతో పాటు విద్యుత్ శాఖ బృందం దీపసరాయి ప్రాంతంలో ఉన్న ఎంపీ ఇంటికి చేరుకుంది. సుమారు గంటపాటు అక్కడ విచారించారు. దీని తర్వాత, విద్యుత్ శాఖ ఎస్‌డిఓ సంతోష్ త్రిపాఠి ఎంపి బుర్కేపై యాంటీ పవర్ థెఫ్ట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: Instagram New Feature: ఇంస్టాగ్రామ్ లో కొత్త ఫీచర్.. చాటింగ్ చేసే వాళ్లకి పండగే
పాత మీటర్‌ను చెక్ చేస్తే.. కరెంటు దొంగ భాగోతం బయటపడింది..
Ziaur Rahman Barq: ఎంపీ బర్కే ఇంటి వద్ద 2 కిలోవాట్‌ల రెండు కనెక్షన్లు ఉన్నాయని సూపరింటెండింగ్ ఇంజనీర్ వినోద్ కుమార్ గుప్తా తెలిపారు. ఒకటి ఎంపీ జియావుర్ రెహమాన్ పేరు మీద, మరొకటి అతని తాత పేరు మీద ఉన్నాయి. రెండు రోజుల క్రితం స్మార్ట్ మీటర్‌ను అమర్చారు. ఎందుకంటే, గత 6 నెలలుగా వారి ప్రాంగణంలో కరెంట్ వినియోగం జీరోగా రావడాన్ని అధికారులు గమనించారు. దీంతో స్మార్ట్ మీటర్ అమర్చారు. ఈ ఉదయం అదే గదిలోని వారి ఆవరణలో తనిఖీలు చేశారు. పరిశోధనలో బుర్కే ఇంట్లో 16 కిలోవాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు మీటర్ రీడింగ్ వచ్చింది. కొత్త మీటర్లు అమర్చిన తరువాత పాత మీటర్లను మీటర్ టెస్టింగ్ కోసం ల్యాబ్ కు పంపించారు. అందులో విద్యుత్ మీటర్లను ట్యాపరింగ్ చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. దీంతో విద్యుత్ చోరీ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చౌర్యం సెక్షన్ 135 కింద ఎంపీ జియావుర్ రెహమాన్ బుర్కేపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
కొసమెరుపు ఏమిటంటే.. విద్యుత్ చోరీ విషయమై అధికారులు సదరు ఎంపీని ప్రశ్నించినపుడు ఆయన వారిని బెదిరించారు. విద్యుత్ శాఖ జూనియర్ ఇంజనీర్ మంగళ్, అజయ్ శర్మలు తమను ఎంపీ తండ్రి మమ్లుకుర్ రహ్మాన్ బుర్కే బెదిరించారని చెప్పారు. ఏమని బెదిరించారా తెలుసా? మా ఎస్పీ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అంతు చూస్తాను అని. అదీ అక్కడి పరిస్థితి.