AP News: మానవుల ఉచ్చులో చిక్కుకొని వన్యమృగాలు అంతరించి పోతూనే ఉన్నాయి. మానవుల తప్పిదాల కారణంగా ఎన్నో అటవీ జాతుజాలాలు బలవుతూనే ఉన్నాయి. అటవీ ప్రాంతాల సమీప గ్రామాల ప్రజలు తమ రక్షణ కోసం, పంటలను కాపాడుకోవడం కోసం క్రూరమృగాలను బలిగొంటున్నారు. ఎన్ని అటవీ చట్టాలు వచ్చినా ఇలాంటి చర్యలకు ఫుల్‌స్టాప్ పడేలా లేదు.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో ఓ రైతు పందుల నుంచి పంటను కాపాడుకునేందుకు వేసిన వలలో చిక్కుకొని ఓ చిరుత ప్రాణాలిడిసింది. పందుల కోసం రైతు పెట్టిన ఉచ్చులో పడిన ఓ చిరుతపులి చనిపోయింది. ఉదయం రైతు తన పొలం వద్దకు వెళ్లి చూడగా తాను పెట్టిన పందుల ఉచ్చులో చిక్కి చనిపోయి ఉన్న చిరుతపులి కనిపించడంతో అవాక్కయ్యాడు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
AP News: ఈ వార్త తెలిసి మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతాల్లో ఇంకా ఎన్ని చిరుత పులులు ఉన్నాయోనని భయాందోళన నెలకొన్నది. సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అటవీ శాఖ అధికారులు తమ గ్రామాల్లోకి క్రూరమృగాలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.