Fake Currency: నేరం చేసైనా సరే డబ్బు సంపాదించాలనుకోవడం చాలామందిలో ఉండే కోరిక. ఇప్పుడు నేరం ఎలా చేయాలనేదానికి యూట్యూబ్ లో వచ్చే వీడియోలు దారులు వెతుక్కుంటున్నారు. అలా ఓ ఇద్దరు వ్యక్తులు నకిలీ నోట్లను ప్రింట్ చేయడం నేర్చుకుని.. దందా మొదలు పెట్టారు. కానీ, మొదట్లోనే పోలీసులకు దొరికిపోయి ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు. వివరాలు తెలుసుకుందాం రండి.
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో రూ.30,000 విలువైన నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు . సతీష్ రాయ్, ప్రమోద్ మిశ్రా రూ.10 స్టాంపు పేపర్లలో రూ.500 నకిలీ నోట్లను కంప్యూటర్ ద్వారా ప్రింటింగ్ మొదలు పెట్టారు. మిర్జాపూర్ నుంచి స్టాంప్ పేపర్ కొనుగోలు చేసి ఈ నేరానికి పాల్పడ్డారు.
ఇది కూడా చదవండి: Uttar Pradesh: దారుణం.. కుక్కపిల్లపై పెట్రోల్ పోసి చంపిన మహిళలు
Fake Currency: 500 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఒక దుకాణంలో నోట్లు ఇచ్చి కొన్ని పరికరాలు కొన్నారు. అయితే, తరువాత ఆ దుకాణ యజమానికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఇద్దరినీ పట్టుకున్నారు. వారి వద్ద నుంచి నకిలీ 500 రూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు . ఈ క్రమంలో పోలీసులు జరిపిన విచారణలో సతీష్ రాయ్, ప్రమోద్ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు చేసిన వారి నుంచి రూ.500 నకిలీ నోట్లతో పాటు ఆల్టో కారు, నోట్లు ముద్రించేందుకు ఉపయోగించే పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ షీట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకీ దుకాణ యజమాని మొదట 500 నోట్లను నిజమైనవిగానే భావించారు. కానీ ఎక్కడ అనుమానం వచ్చిందంటే.. ఈ నిందితులు ఇచ్చిన 20 నోట్లలో అన్నింటిపై ఒకే సీరియల్ నెంబర్ ఉంది. పాపం.. అంతా కరెక్ట్ గానే చేసాం కదా.. ఎలా దొరికిపోయాం అని కటకటాల వెనుక కూచుని ఆలోచిస్తున్నారు నేరస్థులు.