Lingala Ghanapuram: ఓ 20 ఏండ్ల క్రింతం నాటి వరకు పిల్లలకు పేర్లు పెట్టడంలో అందరూ ఒకే పద్ధతి పాటించేవారు. ఏమిటంటే.. తమ పూర్వీకుల, ప్రధాన హిందూ దేవుళ్ల పేర్లు ఎక్కువగా పెట్టుకునేవారు. కొన్ని గ్రామాల పరిధిలో సమీపంలో ఉన్న ప్రతిష్ఠాత్మక ఆలయం ఉంటే ఆ దేవుడి పేరును ఆ పరిసర గ్రామాల్లో విరివిగా పెట్టుకునే వారు. అయితే ఇప్పటికీ ఇలాంటి ఒరవడే ఉన్నా ఆధునికతను జోడించి మొదటి అక్షరం కలిసొచ్చేలా పేర్లు పెట్టుకుంటున్నారు. అయితే ఆ పాతతరం కోవలో ఓ ఊరిలో ఒకే పేరు గల వారు 200 మంది ఉండటం విశేషం.
Lingala Ghanapuram: తెలంగాణ పల్లెల్లో విరివిగా ఈ నానుడి పూర్వం నుంచి పాటిస్తూ వస్తున్నారు. అయితే జనగామ జిల్లాలోని లింగాల ఘనపురం గ్రామంలో త్రేతాయుగం కాలం నుంచే శ్రీరామచంద్రస్వామి ఆలయం ఉన్నది. దీంతో తమ ఊరి, ఇష్టదైవమైన ఆ శ్రీరాముడి పేరు ఇంటికొకరు పెట్టుకోవడం తొలినాళ్ల నుంచి ఆనవాయితీగా వస్తున్నది. అయితే ఇప్పటికీ ఆ ఊరిలో రాములు అనే పేరున్న వ్యక్తులు 200 మంది ఉండటం విశేషం. వారంతా 20 ఏండ్లకు పైగా వయసున్న వారే కావడం గమనార్హం.
Lingala Ghanapuram: అయితే ఈ 20 ఏండ్ల కాలంలో ఆ ఇష్టదైవం పేరే ఎక్కువగానే పెట్టుకుంటున్నా.. “రా” అనే అక్షరంతో కలిసొచ్చే పేర్లకు ఆధునికతను జోడించి పెట్టుకుంటున్నారు. ఇంటికొకరైనా ఆ దేవుడి పేరు పెట్టుకుంటున్నారని గ్రామస్థులు తెలిపారు. ఇది పూర్వం నుంచే పెద్దలు పాటిస్తున్నారని చెప్పడం గమనార్హం.