Uttar Pradesh: రోజురోజుకీ మనుషులు కిరాతకంగా మారిపోతున్న ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. మొన్నటికి మొన్న హైదరాబాద్ లో ఒక వ్యక్తి కుక్కను రెండో అంతస్థు నుంచి విసిరివేసి చంపిన వైనం తెలిసిందే. ఇదిగో ఇప్పుడు మీరట్ లో అలంటి సంఘటన కాదు.. కాదు.. అంతకు మించిన కిరాతక చర్య వెలుగులోకి వచ్చింది.
మీరట్‌లోని కంకెరఖేడా ప్రాంతంలోని ఒక వీధిలో కుక్క ఐదు పిల్లలను కనింది. బుజ్జిగా ఉన్న ఆ కుక్కపిల్లలు అరుస్తూ తిరుగుతున్నాయి. వాటి అరుపులు తమను డిస్టర్బ్ చేస్తున్నాయని ఇద్దరు మహిళలకు చికాకు కలిగింది. ఇంకేముంది.. వారిలో క్రూరత్వం బయటకు వచ్చింది. ఆ కుక్క పిల్లలపై పెట్రోల్ పోసి.. నిప్పంటించి చంపేశారు. స్థానికులు తెలిపిన వివరాలతో పోలీసులు ఆ మహిళలను అరెస్ట్ చేశారు. యానిమల్ కేర్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అన్షుమాలి వశిష్ఠ్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ జితేంద్ర కుమార్ మీడియాకు తెలిపారు.
ఇది కూడా చదవండి: High Court: టీవీ చూడవద్దంటే అది హింస కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
Uttar Pradesh: కంకెరఖేడ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో శోభ, ఆర్తి అనే ఇద్దరు నిందితులపై జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 325 కింద కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ప్రకారం.. రోహతా రోడ్డులోని సంత్ నగర్ కాలనీలో నవంబర్ 5న ఈ ఘటన జరిగింది.