Devara 2: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్లో ‘వార్-2’ చిత్రాన్ని పూర్తి చేసిన తారక్, ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కొత్త సినిమా షూటింగ్లో నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుందని సమాచారం. అంతేకాదు, ఆ తర్వాత తమిళ దర్శకుడు నెల్సన్‌తో 2027లో, త్రివిక్రమ్‌తో 2028లో సినిమాలు రానున్నాయని అంచనా. ఈ లైనప్‌తో ఎన్టీఆర్ అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. కానీ, ఇక్కడే ఓ ఆసక్తికర ప్రశ్న తలెత్తుతోంది.
‘దేవర’ సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు కొరటాల శివ, ‘దేవర-2’ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ షెడ్యూల్ చూస్తే, ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కే అవకాశం కనిపించడం లేదు. దీంతో ‘దేవర-2’ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు విడుదలవుతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై ఎన్టీఆర్ లేదా కొరటాల నుంచి స్పష్టత రానుందా? అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

