LPG Scooter

LPG Scooter: ప్రపంచంలో మొట్టమొదటి గ్యాస్ తో నడిచే స్కూటర్.. ఏ కంపెనీ నుంచంటే..

LPG Scooter: ఇప్పటివరకూ స్కూటర్ అంటే పెట్రోల్ తో నడిచేదనే మనకు తెలుసు. ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్ స్కూటర్లు హవా కూడా పెరుగుతోంది. కానీ, ఎవరూ ఊహించని విధంగా ఒక కంపెనీ CNG స్కూటర్ తీసుకురాబోతోంది. ప్రపంచంలోనే తొలిసారిగా CNGతో నడిచే స్కూటర్ మన దేశంలోనే తయారయింది. మన దేశంలో విడుదలకు సిద్ధం అయింది. ఇంతకీ ఈ CNG స్కూటర్ ను తీసుకువస్తున్న కంపెనీ ఏమిటంటే అది టీవీఎస్. ఇప్పటీకే తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో ఈవీ స్కూటర్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న టీవీఎస్ ఇప్పుడు CNG స్కూటర్ తీసుకురాబోతోంది.

ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశివారికి శ్రమ ఎక్కువ.. కొందరికి అనవసర సమస్యలు.. 

TVS జూపిటర్ CNG కాన్సెప్ట్ ప్రపంచంలోనే మొదటి CNG-శక్తితో కూడిన స్కూటర్. ఇది కంపెనీ పెట్రోల్ స్కూటర్ జూపిటర్ 125 ఆధారంగా రూపొందించారు. 2-లీటర్ పెట్రోల్ ట్యాంక్‌తో పాటు సీటు కింద 1.4 కిలోల CNG ట్యాంక్‌ను దీనిలో అమర్చారు. ఈ స్కూటర్ రెండు ట్యాంక్‌లను (CNG + పెట్రోల్) పూర్తిగా నింపితే 226 కిమీ రేంజ్ ఇస్తుంది. CNG మోడ్‌లో దీని మైలేజ్ కిలోకు 84 కిమీ అని కంపెనీ చెబుతోంది. టీవీఎస్ మోటార్ ఈ స్కూటర్ విడుదల తేదీని ధృవీకరించలేదు.

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో టీవీఎస్ కంపెనీ ప్రపంచంలోనే తొలి CNG కాన్సెప్ట్ స్కూటర్ ప్రదర్షించింది. దీని లుక్ జూపిటర్ లానే ఉంది. ప్రస్తుతం ఎక్స్‌పో 2025లో టీవీఎస్ తన CNG కాన్సెప్ట్ స్కూటర్ తో సంచలనం సృష్టిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *