Election Commission:తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్నది. ఇప్పటికే సర్పంచ్‌గా పోటీచేసే ఆశావహులు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. ఆయా రాజకీయ పార్టీలు కూడా తమ రాజకీయ వ్యూహాలను రచిస్తున్నాయి. రిజర్వేషన్లు మారనున్న దృష్ట్యా అంతటా ఉత్కంఠ నెలకొన్నది.
Election Commission:ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఓటరు జాబితాలను సిద్ధం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం వార్డుల విభజన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోటీచేసే అభ్యర్థుల గుర్తులను కూడా నిర్ణయించింది. ఈ మేరకు సర్పంచ్ స్థానానికి 30 గుర్తులు, వార్డు స్థానాలకు 20 గుర్తులను కేటాయించారు. సర్పంచ్ అభ్యర్థికి గులాబీ రంగు బ్యాలెట్ కాగితం, వార్డు స్థానాలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్ గుర్తులను కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
Election Commission:ఈ సారి జరిగే పంచాయతీ ఎన్నికల్లో నోటాకు ఓటు వేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు సంబంధిత అధికారులు నివేదిక తయారు చేసి ఎన్నికల సంఘానికి ఇప్పటికే పంపించారు. వాటిని ఎన్నికల సంఘం ఆమోదిస్తే అవే తేదీల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.
Election Commission:స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. తమ వర్గానికే రిజర్వేషన్ ఖరారు కావాలని వివిధ వర్గాలు ఆశపడుతున్నాయి. ఈ మేరకు గ్రామాల్లో అప్పుడే రాజకీయ వేడి రాజుకుంటున్నది. రిజర్వేషన్ల కోసం కులగణన సర్వే చేయడంతో ఆశావహుల్లో కొంత గుబులు నెలకొన్నది. రిజర్వేషన్ ఏది వస్తుందోననే అంచనా వేయలేక అయోమయంలో పడ్డారు. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావహులు సంఖ్య భారీగా ఉండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా సర్పంచ్ స్థానాలను పెద్ద సంఖ్యలో కైవసం చేసుకునే యోచనలో ఉన్నది. మరోవైపు బీజేపీ కూడా తన బలాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నది.