TVK Maanadu: తమిళ నటుడు విజయ్ రాజకీయం లోకి వస్తున్న విషయం తెలిసిందే. 2026 ఎన్నికలే లక్ష్యంగా తమిళగ వెట్రి కళగం పార్టీని ఆయన స్థాపించారు. తమిళనాడులోని విల్లుపురం జిల్లా విక్రవాండి లోని వీసాలైలో తొలిసారిగా పార్టీ మహానాడును ఏర్పాటు చేశారు. పార్టీ పెట్టిన తర్వాత మొదటి బహిరంగ సభ కావడంతో దీని కోసం అందరూ ఎదురు చుస్తున్నారు. ఈ తొలి బహిరంగా సభ లో ఐదు లక్షల మంది సరిపడేలా ఏర్పాట్లు చేశారు నేతలు. రెండు చేతులెత్తి మొక్కుతున్నా… అభిమానులంతా పెద్దఎత్తున తరలి రావాలని విజయ్ కోరారు. తొలి బహిరంగ సభలో పార్టీ జెండా ఆవిష్కరణ..ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు.
టీవీకే మొదటి మహానాడు కావడంతో నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. విళుపురం జిల్లా విక్రవాండిలో సాయంత్రం 5 గంటల నుంచి టీవీకే మహానాడు జరుగుతుంది.
తిరుచ్చి జాతీయ రహదారిలో సుమారు 3 కిలోమీటర్ల మేర జెండాలు, విద్యుత్ దీపాలంకరణతో అద్భుతంగా ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి: Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?