Tvk: తమిళ రాజకీయాల్లో సన్నాహక తుఫాన్‌కు తెరలేపుతూ, హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) కీలక నిర్ణయం తీసుకుంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. సీఎం అభ్యర్థిగా విజయ్ను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది.
మహాబలిపురంలో జరిగిన పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 2,000 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. సెప్టెంబర్ 27న కరూరులో జరిగిన ప్రజా ర్యాలీలో తొక్కిసలాటలో మరణించిన 41 మందికి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ మొత్తం 12 కీలక తీర్మానాలు ఆమోదించింది.
ప్రధాన అంశాలు
• టీవీకే 2026 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
• విజయ్ సీఎం అభ్యర్థి
• ఎన్నికల పొత్తుల విషయంలో తుది నిర్ణయం విజయ్‌కే
• SIR ఓటర్ల సవరణ ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్
• డీఎంకే, బీజేపీ ప్రభుత్వాలపై ధ్వజమెత్తిన టీవీకే
టీవీకే, తమిళ మత్స్యకారులపై శ్రిలంకా నేవీ దాడులు, మహిళల భద్రత, రైతుల సమస్యలు, పారిశ్రామిక పెట్టుబడుల లోపం వంటి అంశాలపై ప్రభుత్వాలను తీవ్రంగా విమర్శించింది. రాష్ట్ర భద్రత దెబ్బతిన్నదని, కోయంబత్తూరు ఘటనను ఉదాహరణగా చూపించిది.
సమావేశం సందర్భంగా భద్రతా కారణాల వల్ల పోలీసులు పార్టీ బ్యానర్లు, జెండాలను తొలగించడం కూడా చర్చనీయాంశమైంది
టీవీకే ఈ నిర్ణయాలతో తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

