Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పిన టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం ఆగస్టు నెలకు సంబంధించిన దర్శన టికెట్లు, సేవల టికెట్లు, వసతి గదులు, వీఐపీ సేవల వివరాలను ప్రకటించింది. శ్రీవారిని దర్శించుకునేందుకు ఆసక్తిగల భక్తులు ముందుగానే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ తేదీల్లో విడుదల కానున్న టికెట్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆర్జిత సేవల టికెట్లు (అడ్వాన్స్ బుకింగ్)
-
మే 19 ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించిన ఆర్జిత సేవల టికెట్లు (ఇలక్ట్రానిక్ డిప్ ద్వారా) విడుదల.
-
మే 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లను నమోదు చేసుకోవచ్చు.
-
ఎంపికైన భక్తులు మే 21 నుండి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు చెల్లింపు పూర్తి చేస్తే టికెట్లు మంజూరు అవుతాయి.
ప్రత్యేక ఆర్జిత సేవలు (మే 22 విడుదల)
-
మే 22 ఉదయం 10 గంటలకు: కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, సాలకట్ల పవిత్రోత్సవాలకు టికెట్లు.
-
మే 22 మధ్యాహ్నం 3 గంటలకు: వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్‌లు.
ఇతర ముఖ్యమైన టికెట్లు
-
మే 23 ఉదయం 10 గంటలకు: అంగప్రదక్షిణం టోకెన్లు.
-
మే 23 ఉదయం 11 గంటలకు: శ్రీవాణి ట్రస్టు లైన్ కోటా టికెట్లు.
-
మే 23 మధ్యాహ్నం 3 గంటలకు: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగల భక్తుల కోసం ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు.
రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు
-
మే 24 ఉదయం 10 గంటలకు: ఆగస్టు నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు (రూ.300). వీటికి భారీ డిమాండ్ ఉండే అవకాశం ఉంది, కావున భక్తులు ముందుగానే బుక్ చేసుకోవాలి.
ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా తగ్గి సడెన్ షాకిచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడు హైదరాబాద్‌లో తులం బంగారం ధర ఎంతంటే?
వసతి గదుల బుకింగ్
-
మే 24 మధ్యాహ్నం 3 గంటలకు: తిరుమల, తిరుపతిలోని గదుల కోటా విడుదల.
శ్రీవారి సేవలు – జూలై కోటా
-
మే 29 ఉదయం 11 గంటలకు: తిరుమల-తిరుపతి శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ లీడర్స్ సేవల జూలై నెల కోటా టికెట్లు విడుదల.
భక్తులకి సూచనలు
భక్తులు అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.in ద్వారా సమయానికి టికెట్లు బుక్ చేసుకోవాలి. ప్రతి విడత టికెట్లకు సంబంధించిన సమయాలు తప్పకుండా గుర్తుపెట్టుకుని, టికెట్లను ముందుగా బుక్ చేసుకోవడం వల్ల దర్శనం నిరవధికంగా అవుతుంది.
శ్రీవారి దర్శనం కోసం భక్తులు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, సేవల వివరాలు ఇలా వెల్లడించిన టీటీడీకి ప్రత్యేక ధన్యవాదాలు. తిరుమల ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు ముందస్తుగా ఈ సమాచారం ఆధారంగా మీ ప్రణాళికలు వేసుకోండి.