TS News

TS News: హయత్‌నగర్‌లో దారుణ ఘటన

TS News: హయత్ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిలయన్స్ డిజిటల్ షో రూమ్ దగ్గర రక్తం మడుగులో పడి ఉన్న వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు. హయత్ నగర్ ముద్దిరాజ్ కాలనీకి చెందిన నగేష్‌గా గుర్తించారు.

నగేష్ ను హత్య చేసి మృతదేహాన్ని పడేశారా..లేదా అక్కడే హత్య చేశారా.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుడు తలకు, చేతులకు, కాళ్లకు కత్తి గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికు మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్‌తో దర్యాప్తు చేపట్టారు.

Also Read: Manchu Manoj: మంచు ఇంట మళ్లీ రచ్చ.. విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు.. ఎందుకంటే..?

TS News: కాగా, నగేష్ భార్య శిరీష నిన్న ఆత్మహత్య చేసుకుంది. భార్య సూసైడ్ చేసుకోవడంతో భర్త నగేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న నగేష్‌ను బంధువులు వచ్చి జామీను మీద బయటకు తీసుకొచ్చారు. అయితే, శిరీష ఆత్మహత్యతో నగేష్‌ పై ఆగ్రహంతో మృతురాలి బంధువులు హత్య చేశారా.. లేక భార్య ఆత్మహత్యతో నగేష్‌ ఆత్మహత్యా చేసుకున్నాడా..అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *