Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో నిర్వహించిన ప్రసంగంలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాటల్లో:
“భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నేను ఆపాను.”
“గత తొమ్మిది నెలల్లో మొత్తం 7 యుద్ధాలను ఆపడానికి నేను ప్రయత్నించాను.”
“ప్రపంచ దేశాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి, కానీ నేను ప్రపంచశాంతి కోసం కృషి చేస్తున్నాను.”
ట్రంప్ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలను కాపాడటం తనకు అసలైన ‘నోబెల్ బహుమతి’ అని పేర్కొన్నారు. ఆయన ఐక్యరాజ్యసమితి వ్యవస్థపై కూడా విమర్శలు చేశారు.
“యుద్ధాలను ఆపడంలో ఐక్యరాజ్యసమితి ఘోరంగా విఫలమైంది.”
“ఐక్యరాజ్యసమితి తన ప్రాముఖ్యతను కోల్పోయింది.” ప్రస్తుతం, ట్రంప్ ప్రసంగం అంతర్జాతీయ వేదికపై హల్చల్ సృష్టిస్తోంది. ఆయన వ్యాఖ్యలు ప్రత్యేకంగా భారత్-పాకిస్తాన్ సంబంధాలపై ప్రపంచ వర్గాల ఆసక్తిని పెంచాయి.