Turmeric side effects

Turmeric side effects: పసుపు.. ఎక్కువ తింటే విషంగా మారతుందా..?

Turmeric side effects: పసుపు ఒక శక్తివంతమైన మసాలా. భారతీయ వంటకాల్లో ఇది కంపల్సరీ ఉంటుంది. పసుపు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. పసుపులోని యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అనేక వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి. పసుపు కర్కుమిన్ అనే సమ్మేళనంతో కూడి ఉంటుంది. పసుపు కొన్ని రకాల క్యాన్సర్ కణాలను చంపుతుంది. ఇది చర్మ సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, కీళ్ల నొప్పులు, అజీర్ణానికి బాగా పనిచేస్తుంది.

పసుపు ఉపయోగాలు..

నొప్పి నిర్వహణ:
బెణుకులు, వాపులకు చికిత్స చేయడానికి పసుపును పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. దీనిలోని కర్కుమిన్ సమ్మేళనం నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించే సామర్థ్యం కర్కుమిన్ కు ఉందని ఓ పరిశోధనలో తేలింది. ఆర్థరైటిస్ రోగులకు, పసుపు వాపును తగ్గిస్తుంది.

గుండె ఆరోగ్యం:
పసుపు ‘చెడు’ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. ఇది ఎండోథెలియం లేదా రక్త నాళాల లైనింగ్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది గుండెను రక్షించే శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంది.

డయాబెటిస్:
పసుపు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో డయాబెటిస్ ప్రభావాలను తగ్గిస్తుంది. కర్కుమిన్ ఇన్సులిన్ నిరోధకత, హైపర్గ్లైసీమియా, హైపర్లిపిడెమియా, ఐలెట్ అపోప్టోసిస్, నెక్రోసిస్‌లను నిర్వహించడంలో బాగా పనిచేస్తుంది.

రోగనిరోధక శక్తి:
పసుపు ఇన్ఫెక్షన్లు, కాలానుగుణ వ్యాధులను నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి.

పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు:

విషపూరితం:
పసుపుతో కొన్ని ఆల్కలాయిడ్లు, శుద్ధి చేసిన కర్కుమిన్ దాని సారాలను పెద్ద పరిమాణంలో వినియోగించినప్పుడు విషపూరితంగా మారే అవకాశం ఉంటుంది. పసుపు రోజుకు 5-10 గ్రాములు మాత్రమే తినాలి.

ఘాటైన మసాలా:
ఆయుర్వేదంలో పసుపును ఘాటైన మసాలాగా పరిగణిస్తారు. దీని అర్థం రక్తస్రావం లోపాలు, అమెనోరియా వంటి పిత్త సమస్యలు ఉన్నవారు దీనిని జాగ్రత్తగా తీసుకోవాలి.

వేసవిలో వాడొద్దు:
వేసవిలో ఎక్కువగా పసుపు వినియోగించడం మంచిది కాదు. కాబట్టి వేసవిలో వంటకాల్లో కొద్ది మొత్తంలో మాత్రమే వేసుకోవాలి.

బరువు తక్కువగా ఉన్నవారికి:
పసుపు బరువు తగ్గడానికి సహాయపడుతుంది. బరువు పెరగాలనుకునేవారు లేదా ఇప్పటికే బరువు తక్కువగా ఉన్నవారు ఎక్కువగా పసుపు తినడం మంచిది కాదు.

పొడి చర్మం ఉన్నవారు :
డీహైడ్రేషన్, మలబద్ధకం, పొడి చర్మంతో బాధపడేవారు పసుపును ఎక్కువగా తినకూడదు. అలాంటి వారు పసుపును నెయ్యి వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో తక్కువగా తీసుకోవాలి.

అలెర్జీ :
చాలా మందికి పసుపు అలెర్జీగా ఉంటుంది. పసుపు తినడం వల్ల దద్దుర్లు, చర్మం దురద లేదా కడుపు నొప్పి కూడా రావచ్చు.

ALSO READ  Tulsi Plant: చలికాలంలో తులసి మొక్క ఎండిపోతుందా? ఈ టిప్స్ పాటించండి

జీర్ణ సమస్యలు:
పసుపును అధికంగా తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం, తలతిరగడం లేదా విరేచనాలు వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.

మీరు రోజుకు ఎంత పసుపు తినాలి?

పలు అధ్యయనాలు రోజుకు 500 -10,000 మి.గ్రా. పసుపు మాత్రమే తినాలని సూచిస్తున్నాయి. పసుపును మితంగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. కోవిడ్, ఆర్‌ఎస్‌విలపై ప్రభావంతంగా పనిచేస్తుంది. అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *