Trisha: ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తమిళనాడు సీఎం కావాలన్నది తన బలమైన కోరికని త్రిష పేర్కొన్నారు. ఆమె ప్రజాసేవతో పాటు సామాజిక మార్పులను రాజకీయాల ద్వారా సాధించవచ్చు అని అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆమె వ్యాఖ్యల వెనక అసలు ఉద్దేశం ఏమిటోనని చర్చలు జరుగుతున్నాయి.
త్రిష వంటి సూపర్‌స్టార్ స్థాయిలో ఉన్న కథానాయిక, రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలను ఈజీగా ఖండించడాన్ని విశ్లేషకులు కష్టంగా భావిస్తున్నారు. తమిళనాట రాజకీయాలు మరియు సినిమాలకు ఎప్పుడూ అనుబంధం ఉంటుంది. అగ్ర హీరో దళపతి విజయ్ కూడా సినిమాలను వీడించి, సొంత పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇలాంటి సమయంలో, త్రిష వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

