Odisha : పూరి ఆలయం పై డ్రోన్ కలకలం

Odisha : ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రసిద్ధ జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగిరిన ఘటన కలకలం రేపింది. సుమారు అరగంట పాటు ఆ డ్రోన్ ఆలయంపై తిరిగి అక్కడి దృశ్యాలను చిత్రీకరించింది. జగన్నాథ ఆలయం నో ఫ్లయింగ్ జోన్ ప్రాంతంలో ఉన్నందున, డ్రోన్ ఎగురడం భద్రతా లోపాలను ప్రదర్శించింది.

ఈ ఘటనపై న్యాయ శాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ స్పందిస్తూ, జగన్నాథ ఆలయంపై డ్రోన్ ఎగురవేయడం చట్టవిరుద్ధమని, దీనిని ఆమోదించడం తగదని అన్నారు. భద్రతా ఉల్లంఘనకు పాల్పడిన వారిని గుర్తించి, కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా, ఆలయ చుట్టూ ఉన్న నాలుగు వాచ్‌టవర్ల వద్ద 24 గంటలు పోలీసు సిబ్బందిని మోహరించే చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.

ఇక, పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి యూట్యూబర్ కావచ్చనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Golden Temple: స్వర్ణదేవాలయం దగ్గర కాల్పులు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *