Tripura:తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొడుకు ప్రతీక్‌దేవ్ వర్మపై త్రిపుర రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిపుర రాష్ట్రంలోని టీఎంపీ పార్టీ ఎమ్మెల్యే అయిన ఫిలిప్ రియాంగ్ ప్రతీక్ దేవ్ వర్మపై లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతీక్‌దేవ్ వర్మ మరో ఇద్దరు కలిసి తనను చంపుతానని బెదిరించారని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tripura:వెస్ట్ త్రిపురంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో గొడవ జరుగుతుండగా, ఓ ముగ్గురిని బయటకు వెళ్లమని తాను వారికి చెప్పానని ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ చెప్పారు. ఆ తర్వాత ప్రతీక్‌దేవ్ వర్మ మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి తనను చంపుతానని బెదిరించారని ఎమ్మెల్యే ఫిలిప్ రియాంగ్ ఆరోపించారు. సుమారు 400 నుంచి 500 మంది బీజేపీ కార్యకర్తలను తీసుకొచ్చి తనను, తన కుటుంబం మొత్తాన్ని చంపేస్తామని బెదిరించారని ఎమ్మెల్యే పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

