Uttar Pradesh: ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా..

Uttar Pradesh: అక్కడ అంతే..ఏ చిన్న తగాదా వచ్చిన చంపుకోవడమే. అందుకు ప్రధాన కారణం చదువులేకపోవడమే. చదువు చెప్పడానికి వచ్చిన వాళ్ళను చంపడం. మరి ఎలా డెవలప్ అయ్యేది. అలాంటి సంఘటనే ఇప్పుడు అక్కడ జరిగింది. ఏ మాత్రం కనికరం లేకుండా…చిన్న పిల్లలు అని కూడా చూడకుండా చంపేశారు. మనుషులేనా విల్లు…చి చి మరి మనసు కూడా లేని మూర్ఖులులా మారిపోయారు ఏంట్రా .

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీలో దారుణం జరిగింది. ఉపాధ్యాయుడి కుటుంబాన్ని అత్యంత దారుణంగా ఇంట్లో దుండగులు హత్య చేశారు. ఈ ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. సాయుధ దుండగులు ఇంట్లోకి చొరబడి ఉపాధ్యాయుడిని, అతని కుటుంబాన్ని కాల్చి చంపారు. అమేథీలోని శివరతంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్ క్రాస్‌రోడ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతి చెందిన ఉపాధ్యాయుడిని సునీల్ కుమార్ గా గుర్తించారు. అతను పన్‌హౌనాలోని కాంపోజిట్ స్కూల్‌లో అసిస్టెంట్ టీచర్‌గా పనిచేస్తున్నాడు.

సునీల్ కుమార్ భార్య, 6 ఏళ్ల కూతురు, 2 ఏళ్ల కొడుకుతో కలిసి గత మూడు నెలలుగా మున్నా అవస్థి నివాసంలో అద్దెకు ఉంటున్నారు. కుటుంబాన్ని వారి ఇంటిలోనే దారుణంగా కాల్చి చంపారు. ఈ దాడిలో ఉపాధ్యాయుడు, అతని భార్య, ఇద్దరు పిల్లలు మరణించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇక ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి సానుభూతి తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనాస్థలిని వెంటనే సందర్శించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ఇది దోపిడీ కేసుగా కనిపించడం లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కక్షతోనే ఈ హత్య చేసినట్లుగా భావిస్తున్నారు. పాఠశాలలో జరిగిన వ్యక్తిగత కక్షలతోనే ఈ మర్డర్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు నలుగురిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు వచ్చేలోగా మరణించినట్లు ప్రకటించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం.. భారీగా భక్తుల రద్దీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *