Nagarjuna Akkinnei: టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన వ్యక్తిగత హక్కులు, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల సోషల్ మీడియాలో ఆయన పేరుతో ఏఐ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు, పోర్నోగ్రఫీ లింకులు క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఆయన ఫోటోలను టీ షర్టులపై ముద్రించి బిజినెస్ చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. ఈ చర్యలు తన అనుమతి లేకుండా జరుగుతున్నందున వాటిని తక్షణమే ఆపాలని నాగార్జున తన పిటిషన్లో కోరారు.
నాగార్జున తరఫు న్యాయవాది వాదిస్తూ, ఇలాంటి చర్యలు నటుడి పర్సనాల్టీ రైట్స్ ఉల్లంఘన అని, ఆయన గౌరవానికి తీవ్ర భంగం కలిగిస్తున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో, ఏఐ ఆధారిత వీడియోలు, పెయిడ్ ప్రమోషన్స్, హ్యాష్ ట్యాగ్ క్రియేషన్స్ అన్నీ నిషేధించాలని పిటిషన్లో డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Minor Girls: ముగ్గురు మైనర్ బాలికలపై ముగ్గురు యువకుల అత్యాచారం
గురువారం ఈ కేసుపై జస్టిస్ తేజస్ కరియా ధర్మాసనం విచారణ చేపట్టింది. నటుల వ్యక్తిగత హక్కుల రక్షణపై ఇదే మొదటి కేసు కాదని చెప్పాలి. గతంలో బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ వంటి వారు కూడా ఇలాంటి సమస్యల కారణంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.