thug life

Thug Life: కమల్ “థగ్ లైఫ్” టీజర్ తేదీ వచ్చేసింది

Thug Life: కమల్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ సినిమాస్ నిర్మిస్తున్న ‘థగ్ లైఫ్’ షూటింగ్ మొత్తం పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రచారానికి శ్రీకారం చుడుతూ 7వ తేదీన టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు దర్శకనిర్మాతలు. ‘నాయకుడు’ తర్వాత మణిరత్నం, కమల్ కాంబోలో వస్తున్న చిత్రమిది. కమల్ తో పాటు శింబు, త్రిష, అశోక్ సెల్వన్, ఆలీ ఫజల్, నాజర్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, జిషుసేన్ గుప్తా, సాన్యామల్హోత్రా ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 7వ తేదీ కమల్ బర్త్ డే కానుకగా ఈ టీజర్ రాబోతోంది.

ఇది కూడా చదవండి: Nithiin Ishq Re Release: నితిన్ ‘ఇష్క్’ రీ-రిలీజ్.. ఎప్పుడూ అంటే..?

Thug Life: ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.  పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ‘థగ్ లైఫ్’ వచ్చే ఏడాది ఏప్రిల్ 10న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో కమల్, మణిరత్నం మరోసారి ‘నాయకన్’ లాంటి సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Kingdom Twitter Review: హిట్ కొట్టిన విజయ్.. 'కింగ్డమ్‌' ట్విటర్‌ రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *