Pennsylvania Police Shooting: అమెరికాలోని పెన్సిల్వేనియాలో కాల్పులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. నార్త్ కొడోరస్ టౌన్షిప్లో బుధవారం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పోలీసు అధికారులు మరణించారు. మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు.
ఒక కుటుంబ సమస్యకు సంబంధించి విచారణ కోసం పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లగా, ఓ దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు పోలీసులు గాయపడగా, వారిలో ముగ్గురు మరణించారు. గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశి వారికి డబ్బులే డబ్బులు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో దుండగుడు కూడా మరణించాడు. అయితే, నిందితుడి వివరాలు, కాల్పులకు గల కారణాలపై పోలీసులు ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనపై పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షపిరో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో ఇలాంటి హింసకు తావు లేదని, మెరుగైన సమాజం కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మృతి చెందిన అధికారుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.