Kerala

Kerala: గుడిలో భక్తులను తొక్కి చంపిన ఏనుగులు.. కేరళలో భయానక ఘటన

Kerala: లెఫ్ట్ రైట్ …రైట్ లెఫ్ట్. ఇటు అటైనా అటు ఇటైనా..మొత్తానికే మోసం వస్తుంది. ఏనుగులు వచ్చినా …ఏనుగులు ఉన్న ప్లేస్ కు వెళ్లి..కాల్చినా..రెసుల్త్ మాత్రం ఒక్కటే. ఆ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అక్కడ ఏదైతే చేయకూడదో అదే చేశారు. అంతే ..ఆ తెలివి తక్కువ పనికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు . ఇంతకీ ఆ రాష్ట్రంలో జరిగే ఆ పండగలో ..ఇలానే ఎందుకు జరిగింది.

కేరళలో విషాదకరమైన ఘటన జరిగింది. దేవాలయంలో ఉత్సవాల సందర్భంగా పటాకుల శబ్దానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తులపై దాడి చేసి, వారిని తొక్కి చంపినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

కేరళలోని కోజికోడ్ జిల్లాలోని కోయిలాండి సమీపంలోని కురవంగడ్‌లోని మనక్కులంగర భగవతి ఆలయ ప్రాంగణంలో వార్షిక ఉత్సవం జరిగింది. ఉత్సవం చివరి రోజున నిర్వాహకులు రెండు ఏనుగులను తీసుకువచ్చారు.ఉత్సవ సమయంలో నిర్వాహకులు బాణసంచా పేల్చారు. దీంతో ఆ రెండు ఏనుగులు బెదిరిపోయాయి. ఆ తరువాత రెండు ఏనుగులు ఒకదానితో మరొకటి తలపడ్డాయి. ఈ క్రమంలో అక్కడ ఉన్న భక్తులపై దాడి చేస్తూ.. వారిని తొక్కుకుంటూ ఆ ప్రాంతం నుంచి పరుగులు తీశాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 24 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Also Read: Delhi Stampede: ఢిల్లీలో తొక్కిస‌లాట‌కు ఇదే కార‌ణం? మృతులు వీరే!

ఏనుగులను సాయంత్రం ఊరేగింపు కోసం ప్రదర్శిస్తుండగా, పటాకుల శబ్దం విన్న తర్వాత అకస్మాత్తుగా వాటిలో ఒక ఏనుగు బెదిరిపోయింది. మరో ఏనుగుతో ఘర్షణకు దిగింది. ఆ సమయంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఏనుగులు ఒకదానికొకటి తోసుకోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఉత్సవ కార్యాలయం కూడా కూలిపోయింది’’ అని కౌన్సిలర్ చెప్పారు.

దేవాలయంలో జరిగిన ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది రెండు ఏనుగులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, క్రాకర్ల శబ్దానికి ఏనుగులు బెదిరిపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Supreme Court: బెంగాల్ లో రాష్ట్రపతి పాలన పై.. నేడు సుప్రీంకోర్టులో విచారణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *