Condom Packets: గత కొన్ని రోజుల నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు రౌద్రరూపం దాల్చాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నదులు, రిజర్వాయర్లు, కాలువలు ఉప్పొంగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు ఆగిపోగా, పంటలు కూడా దెబ్బతిన్నాయి. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తూ, సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఈ క్రమంలో తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఓ విచిత్ర సంఘటన వెలుగుచూసింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వరదలో అనూహ్యంగా వేల సంఖ్యలో కండోమ్ ప్యాకెట్లు కొట్టుకువచ్చాయి. ఈ దృశ్యం చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఇది కూడా చదవండి: Peddapalli: పెద్దపల్లి కలెక్టరేట్ ప్రజావాణిలో పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్యాయత్నం
మందమర్రి ప్రాంతంలో కనిపించిన ఈ ప్యాకెట్లపై ప్రజల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. సాధారణంగా ప్రభుత్వ ఆరోగ్య విభాగం హెచ్ఐవీ నియంత్రణ కోసం ఐసీటీ సెంటర్లకు పెద్ద ఎత్తున కండోమ్స్‌ను సరఫరా చేస్తుంది. అయితే, వాటిని భద్రపరచడంలో లేదా పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించడమే ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వర్షాలు ఒకవైపు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండగా, ఈ తరహా సంఘటనలు మరోవైపు చర్చనీయాంశమవుతున్నాయి.