Unstoppable: ఆహా ఓటీటీలో నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ సీజన్ ఫోర్ కొద్దివారాలుగా నాన్ స్టాప్ గా సాగిపోతోంది. చంద్రబాబు నాయుడుతో మొదలైన ఈ సీజన్ లో పలువురు సినీ ప్రముఖులు పాల్గొని… తమ నిజ జీవిత ముచ్చట్లనూ బాలకృష్ణతో పంచుకున్నారు. ఇక సంక్రాంతికి విడుదల కాబోతున్న సినిమాల స్టార్ హీరోలు సైతం ఈసారి అన్ స్టాపబుల్ షోలో పాలు పంచుకోబోతున్నారు.
ఇది కూడా చదవండి: Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మనోజ్
Unstoppable: వచ్చే జనవరి 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ మూవీ విడుదల అవుతోంది. అలానే 14వ తేదీన వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రిలీజ్ కాబోతోంది. విశేషం ఏమంటే… ఇదే సంక్రాంతికి వీరిద్దరి సినిమాలతో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘డాకూ మహారాజ్’ కూడా పోటీపడబోతోంది. తన సినిమాకు పోటీ ఇస్తున్న ఇద్దరు స్టార్స్ కు బాలకృష్ణ ఎలాంటి ప్రశ్నలు సంధిస్తారో చూడాలి.

