Clean Water Tank

Clean Water Tank: వాటర్ ట్యాంక్ క్లీన్.. ఇలా చేస్తే చాలా ఈజీ

Clean Water Tank: ప్రస్తుతం అన్ని ఇళ్లలో నీటి ట్యాంక్‌ ఉంది. కొన్ని ఇళ్లలో ఇంటి డిజైన్‌ను బట్టి రెండు, మూడు నీటి ట్యాంకులు ఉంటాయి. ఇంట్లో అన్నీ అవసరాలకు ఈ నీటినే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో కాబట్టి వాటర్ ట్యాంక్‌లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. అయితే ఇంట్లో వాటర్ ట్యాంక్ శుభ్రం చేయడమనేది పెద్ద తలనొప్పి. ట్యాంక్ శుభ్రం చేయడానికి చాలా టైమ్​ పడుతుంది. అందుకే చాలా మంది ఏడాదికి ఒకసారి వాటర్ ట్యాంక్ శుభ్రం చేస్తుంటారు. అయితే ట్యాంక్‌ను సులభంగా ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి: One Nation One Election Bill: జమిలి బిల్లు ఆమోదించిన లోక్‌సభ

ట్యాంక్ మురికిగా ఉండడం వల్ల​ కలిగే నష్టాలు :

వాటర్ ట్యాంక్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడుతుంది. నీటి ట్యాంక్‌ను కనీసం నెల లేదా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేయాలి. లేదంటే ఆ నీటిలో బ్యాక్టీరియా, వైరస్​లు వృద్ధి చెందుతాయి. దీంతో ఆ నీటిని వినియోగించడం వల్ల కొత్త రోగాలు వస్తాయి.

Clean Water Tank: వాటర్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలి..

వాటర్ ట్యాంక్‌ లోపలికి వెళ్లకుండా ఈజీగా క్లీన్ చేయవచ్చు. వాటర్ ట్యాంక్‌ను ఖాళీ చేసిన తర్వాత గోరువెచ్చని నీటిలో కొంత డిటర్జెంట్ పౌడర్, డెటాల్, బేకింగ్ సోడా వేయాలి. ఆ తర్వాత ఆ నీటిని ట్యాంకులో పోయాలి. తర్వాత పొడవాటి ప్యాక్ స్టిక్ లేదా స్టిక్ చీపురుతో ట్యాంక్ మొత్తాన్ని పూర్తిగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత వాటర్​తో క్లీన్​ చేసుకుంటే సరిపోతుంది. వేడినీరు మురికిని త్వరగా బయటకు పంపిస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటితో ట్యాంక్‌ను ఈజీగా క్లీన్ చేయొచ్చు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Wood Chopping Boards: కూరగాయలు కోయడానికి చెక్క బోర్డును ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *