IND vs ENG: ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB) భారత్‌తో జరగనున్న నాలుగో టెస్ట్ మ్యాచ్‌కు తమ జట్టును ప్రకటించింది. ఈ సిరీస్‌లో ఇంగ్లాండ్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో ఉంది. మూడో టెస్ట్‌లో విజయం సాధించినప్పటికీ, ఆ మ్యాచ్‌లో వేలికి గాయం కావడంతో ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్ నాలుగో టెస్ట్ నుంచి తప్పుకున్నాడు. అతని స్థానంలో ఎనిమిదేళ్ల తర్వాత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చాడు లియామ్ డాసన్. 35 ఏళ్ల డాసన్ తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2017లో ఆడాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతని అద్భుతమైన ఫామ్ కారణంగా ఈ అవకాశం దక్కింది.
ఇది కూడా చదవండి: PCB Scam: పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో 595 కోట్ల కుంభకోణం
పేస్ బౌలర్లు సామ్ కుక్, జేమీ ఓవర్టన్‌లను వారి కౌంటీ జట్ల తరఫున ఆడటానికి విడుదల చేశారు. నాలుగో టెస్ట్ మ్యాచ్ జులై 23 నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని చూస్తుంటే, భారత్ సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలతో ఉంది.
నాలుగో టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు
బెన్ స్టోక్స్ (డర్హామ్) – కెప్టెన్, జోఫ్రా ఆర్చర్ (సస్సెక్స్), గస్ అట్కిన్సన్ (సర్రే), జాకబ్ బెథెల్ (వార్విక్‌షైర్), హ్యారీ బ్రూక్ (యార్క్‌షైర్), బ్రైడాన్ కార్సే (డర్హామ్), జాక్ క్రాలే (కెంట్), లియామ్ డాసన్ (హాంప్‌షైర్), బెన్ డకెట్ (నాటింగ్‌హామ్‌షైర్), ఓలీ పోప్ (సర్రే), జో రూట్ (యార్క్‌షైర్), జేమీ స్మిత్ (సర్రే), జోష్ టోంగ్ (నాటింగ్‌హామ్‌షైర్), క్రిస్ వోక్స్ (వార్విక్‌షైర్)