Health Tips: వయసు పెరిగే కొద్దీ శరీరం అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటుంది. అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా 35-40 ఏళ్లలోనే శరీరంలో అనేక రకాల సమస్యలు కనిపిస్తాయి. ఈ వయస్సులో గుండె జబ్బుల నుండి కాలేయ వ్యాధి వరకు వివిధ వ్యాధుల ప్రమాదం డబుల్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో మన శారీరక, మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ వయసులో మంచి జీవనశైలిని కొనసాగించడం, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
35 – 40 ఏళ్ల వ్యక్తులు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి
ఈ వయసులో క్రమం తప్పకుండా గుండె పరీక్షలు చేయించుకోవాలి. గుండె జబ్బుల సంకేతాలు ఏవైనా ఉంటే కొలెస్ట్రాల్ పరీక్ష, ఎక్స్-రే చేయవచ్చు.
ఈ వయసులో రక్తపోటు సమస్యలు ఉండి, ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వైద్యుడిని సంప్రదించాలి.
ఈ వయసులో,డయాబెటిస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా చెక్ చేసుకోవాలి.
35-40 ఏళ్ల మధ్య ఎముక సాంద్రత తగ్గుతుంది. ఎముకల పగుళ్లు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి కాల్షియం, విటమిన్ డి స్థాయిలను చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. తక్కువగా ఉంటే ఉదయం సరైన సూర్యకాంతిని ఆస్వాదించాలి.
మానసిక ఆరోగ్యం ముఖ్యమే:
ఈ వయస్సులో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణం. కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. దీనికోసం, నడక, యోగా వంటి తేలికపాటి వ్యాయామం కనీసం 30 నిమిషాలు చేయాలి.
అధికంగా ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, చిక్కుళ్ళు, తక్కువ కొవ్వు ప్రోటీన్లు ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. మానసిక ఒత్తిడికి అస్సలు లొంగకూడదు.

