Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ నటించబోతున్న చివరి చిత్రం టైటిల్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించారు. ఈ సినిమాకు ‘జన నాయగన్’ అనే పేరు ఖరారు చేశారు. రాజకీయ పార్టీని పెట్టి, వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న విజయ్… తన పార్టీ సిద్ధాంతాలను సైతం ఈ సినిమా ద్వారా జనంలోకి తీసుకెళ్ళబోతున్నారట. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా పేరును, పోస్టర్ ను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ఇదే విజయ్ చివరి చిత్రమని, ఇక మీదట విజయ్ నటించడని అంటున్నారు. అలానే ఇది బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఇంతవరకూ మేకర్స్ ఈ విషయాన్ని తెలియచేయలేదు.

