Onion Benefits: ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు, ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, చాలా మంది బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు డైట్ మార్చుకుంటే, కొందరు జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం అలవాటు చేసుకున్నారు. ఎంత ప్రయత్నించినా బరువు తగ్గలేమని చాలా మంది భావిస్తుంటారు.
వంటలో వాడే ఉల్లిపాయలు బరువు తగ్గడంలో సహాయపడతాయని మీకు తెలుసా? అవును. ఇది నిజం. ఉల్లిపాయ తక్కువ కేలరీల ఆహారం. అలాగే, వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్వెర్సెటిన్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బరువు తగ్గడంలో బాగా సహాయపడుతాయి. ఉల్లిపాయలు ఎలా తినాలి? బరువు తగ్గడం ఎలాగో చూద్దాం.
ఇది కూడా చదవండి: Horoscope Today: ఈ రాశుల వారికి అనుకున్న పనులు ఆలస్యం కావచ్చు.. మీ రాశి అందులో ఉందేమో చెక్ చేసుకోండి!
Onion Benefits: బరువు తగ్గాలనుకుంటే, మీరు ఉల్లిపాయ సలాడ్ తీసుకోవచ్చు. పచ్చి ఉల్లిపాయ సలాడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది బరువు నియంత్రణలో సహాయపడుతుంది. కావాలనుకుంటే, ఉల్లిపాయలను ఇతర కూరగాయలతో తినవచ్చు. రోజుకు ఒక్కసారైనా ఉల్లిపాయ సలాడ్ తినడం వల్ల మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉల్లి రసాన్ని నిమ్మరసం, తేనె కలిపి ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల మెటబాలిజం పెరిగి కేలరీలు వేగంగా కరుగుతాయి. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లిపాయను ముక్కలుగా కోసి జ్యూసర్లో వేసి రసం తీయాలి. నిమ్మరసం, తేనె కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయని నిపుణులు చెబుతున్నారు.