KTR: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా పెచ్చరిల్లిపోతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తోందని ఆయన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దొంగలు పడ్డ ఆరు నెలల తర్వాత ప్రభుత్వ స్పందన వచ్చిందని ఎద్దేవా చేస్తూ, ఇప్పుడు టెలీమెట్రీల గురించి మాట్లాడటం అసమర్థతకు నిదర్శనమని అన్నారు.
కృష్ణా, గోదావరి నదుల నుండి వేల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిపోతున్నా వాటిని ఒడిసిపట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదని మండిపడ్డారు. గత నాలుగున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలన వల్లే తెలంగాణకు నదీజలాల్లో తగిన నీటి వాటా దక్కలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, కేసీఆర్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసి వందల టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు నిర్మించారని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: Airlines Fare: ఛార్జీలు పెంచిన ఎయిర్ లైన్స్.. విమానంలో ప్రయాణించాలి అంటే వీటికి కూడా డబ్బు కట్టాల్సిందే
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కొన్ని పిల్లర్లు కుంగినప్పటికీ, వాటిని బాగుచేసే పనులు చేయకుండా నీటిని వదిలేసి ఇసుక దోచుకోవడం జరుగుతోందని ఆరోపించారు. అలాగే, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 50 టీఎంసీల రిజర్వాయర్లు సిద్ధంగా ఉన్నా, నార్లాపూర్ వద్ద నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా కూడా టెండర్లు రద్దు చేసి, 15 నెలలుగా పనులు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యానికి నిదర్శనమని కేటీఆర్ ధ్వజమెత్తారు.
ఇసుక వ్యాపారం వల్ల రైతుల పొలాలు ఎండిపోతున్నాయని, అన్నదాతలు నష్టపోతున్నారని, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలు ఈ కుట్రలను గుర్తించి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
చేతులు కాలినంక
ఆకులు పట్టుకున్నట్లుదొంగలు పడ్డ ఆరు నెలలకు
కుక్కలు మొరిగినట్లునీళ్లన్నీ తరలించుకు పోయిన తర్వాత అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తీరిగ్గా టెలీమెట్రీల గురించి మాట్లాడుతున్నది
కృష్ణా, గోదావరి నదుల నుండి వేల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నా ఒడిసిపట్టే ఆలోచన ఈ… pic.twitter.com/tydluOdWS0
— KTR (@KTRBRS) March 17, 2025