Allu Family Cutout: ప్రపంచ వ్యాప్తంగా ‘పుష్ప2’ సందడి చేస్తోంది. రిలీజ్ కి ప్రచారంలో బన్నీ అండ్ కో తెగ బిజీగా ఉంది. అయితే ఈ ప్రచారంలో కేవలం అల్లు ఫ్యామిలీ మాత్రమే సందడి చేసింది. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ అల్లు అర్జున్, అల్లు అరవింద్, అల్లుఅయాన్, అల్లుఅర్హ పాల్గొన్నారు. ఇక థియేటర్ల దగ్గర పెట్టిన భారీ కటౌట్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈ కటౌట్ లో అల్లు కుటుంబంలోని నాలుగు తరాల వారికి చోటు లభించింది. అల్లు అర్జున్, ఆయన తల పక్కనే అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్, అల్లుబాబీ, అల్లు శిరీశ్, అల్లు అయాన్ కు ఈ కటౌట్ లో చోటు లభించింది. సాధారంగా ఈ తరహా కటౌట్ లో మెగా ఫ్యామిలీ హీరోల ఫోటోస్ కూడా ఉంటాయి.
Allu Family Cutout: కానీ ఇటీవల కాలంలో మెగా హీరోలు మిస్ అవుతున్నారు. తాజా కటౌట్ లో కేవలం అల్లు ఫ్యామిలీకి మాత్రమే చోటు దక్కటం విశేషం. దీంతో మెగా వర్సెస్ అల్లు అనేది సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ‘పుష్ప2’ త్రీడీ వర్షన్ ను రిలీజ్ చేయలేదు. కారణం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడమేనట. ఈ సినిమా మొత్తం ఏడు ఫార్మేట్స్ లో, 12,500 థియేటర్లలో, ఆరు భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేశారు. ప్రీమియర్స్ కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా నార్త్ లో ప్రీమియర్స్ జరగలేదు. మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పుష్ప2’ టీమ్ కి ఆల్ దబెస్ట్ తెలియచేశాడు.