Poor Sleep: ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం, వ్యాయామం ఎంత ముఖ్యమో తగినంత నిద్ర కూడా అంతే ముఖ్యం. అవును.. రోజంతా కష్టపడితే శరీరం అలసిపోతుంది. కాబట్టి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేకపోవడం వల్ల మీరు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఏమిటో తెలుసుకోండి.
ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మంచి అలవాట్లు అవసరమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తగినంత నిద్ర అవసరం. కానీ చాలా మందికి రాత్రిపూట సరిగా నిద్ర ఉండదు. సరిగ్గా నిద్రపోకపోతే శరీరం అలసిపోతుంది. మీకు తగినంత నిద్ర లేకపోతే, అది మీ మెదడును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇది కూడా చదవండి: Mahaa Kumbhamela 2025: హరహర మహాదేవ నినాదాలు.. సాధువుల ఆనంద నృత్యాలు.. కోలాహలంగా మహాకుంభమేళ చివరి అమృత స్నానం
కడుపులో ఉన్న శిశువు 24 గంటలలో 14 గంటలు నిద్రపోతుంది. ఇది వయస్సుతో క్రమంగా తగ్గుతుంది. పిల్లలు పెరిగేకొద్దీ నిద్ర సమయం కూడా తగ్గుతుంది. కొంతమంది యువకులు 10-12 గంటలు నిద్రపోతారు. వయస్సుతో పాటు నిద్ర సమయం తగ్గాలి. యువకుల నుండి పెద్దల వరకు రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర అవసరమని పరిశోధనలు చెబుతున్నాయి. లేదంటే మెదడు దెబ్బతింటుంది. మీరు ప్రతిరోజూ తగినంత నిద్రపోకపోతే, మెదడులోని న్యూరాన్లు నెమ్మదిగా చనిపోతాయి. రోజంతా పని ఒత్తిడి మెదడుపై ప్రభావం చూపుతుంది. నిద్ర మరుసటి రోజు మెదడును రీసెట్ చేస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే షుగర్, బ్లడ్ ప్రెజర్, కొలెస్ట్రాల్ సమస్యలు, నరాల సమస్యలు వస్తాయి. 60-70 సంవత్సరాలలో చిత్తవైకల్యం, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా మీ శరీరాన్ని ఆక్రమిస్తాయి.