JAAT

JAAT: జాట్’ ఓటిటి రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్..!

JAAT: బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్, టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ‘జాట్’ సినిమా థియేటర్లలో మంచి విజయం సాధించింది. మాస్ ఆడియెన్స్‌కు పూర్తి వినోదాన్ని అందించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి రిలీజ్‌కు సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం, ‘జాట్’ జూన్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంటుందని, ఇతర భాషలపై స్పష్టత రావాల్సి ఉందని సమాచారం. థియేటర్లలో సందడి చేసిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఓటిటిలోనూ అదే జోష్‌ను చూపించనుంది. సీక్వెల్ ప్రకటనతో ఇప్పటికే అంచనాలు పెరిగిన నేపథ్యంలో, ‘జాట్’ ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం అందరి దృష్టి నెట్‌ఫ్లిక్స్‌పైనే ఉంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Jagga reddy: జగ్గారెడ్డి చిట్‌చాట్ – రాజకీయాలపై కొత్త దృష్టికోణం, సినిమాకి ప్రాధాన్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *