Naga Chaitanya: నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీ ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా గురువారం చెన్నయ్ లో తమిళ వర్షన్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. కార్తీ ట్రైలర్ ను విడుదల చేయగా, ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు దర్శకులు కార్తీక్ సుబ్బరాజు, వెంకట్ ప్రభు గెస్టులుగా హాజరయ్యారు. ‘యాభై ఏళ్ళుగా నిర్మాతగా కొనసాగుతున్న అల్లు అరవింద్ నిర్మించిన ‘తండేల్’ను తమిళంలో విడుదల చేయడం ఆనందంగా ఉంద’ ని ఎస్.ఆర్. ప్రభు చెప్పారు. ఈ సినిమాను వన్ లైనర్ గా విన్నప్పుడు ఎంతో ఆసక్తి కలిగిందని, తన బాణీలకు తమిళంలో వివేక్ చక్కని సాహిత్యం అందించారని దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు. ‘తండేల్’ చిత్రనిర్మాణం యేడాదిన్నర పాటు సాగిందని, ఈ జర్నీలో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని సాయిపల్లవి చెప్పింది. ఇది నిజంగా జరిగిన కథ అని, దీనికి సంబంధించిన ఇరవై మంది వ్యక్తుల దగ్గర హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మించామని అల్లు అరవింద్ అన్నారు. ఎంతో పేషన్ తో తీసిన ‘తండేల్’ ఘన విజయం సాధించాలనే ఆకాంక్షను కార్తీ వ్యక్తం చేశారు. ‘హండ్రెస్ పర్సంట్ లవ్’ తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడం ఆనందంగా ఉందని, ‘తండేల్’ లాంటి మూవీ చేయడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని నాగచైతన్య చెప్పారు.
