Telugu Thalli Flyover

Telugu Thalli Flyover: హైదరాబాద్‌లో తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ పేరు మారింది!

Telugu Thalli Flyover: హైదరాబాద్‌ నగరంలో మరో ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ‘తెలుగుతల్లి ఫ్లైఓవర్‌’గా పిలవబడుతున్న పైవంతెనకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పేరు పెట్టింది. ఇకపై ఇది ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌’గా గుర్తింపు పొందనుంది.

ట్యాంక్‌బండ్‌ సమీపంలోని ఈ ఫ్లైఓవర్‌పై ఇప్పటికే కొత్త బోర్డులు అమర్చారు. తెలంగాణ సంస్కృతి, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

నిర్మాణ చరిత్ర

1997లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఫ్లైఓవర్‌కు శంఖుస్థాపన చేశారు. సచివాలయం ప్రాంతంలో పెరుగుతున్న వాహన రద్దీని తగ్గించేందుకు ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. దాదాపు ఎనిమిదేళ్లపాటు పనులు కొనసాగి, 2005లో అప్పటి పురపాలక శాఖ మంత్రి కొనేరు రంగారావు దీన్ని ప్రారంభించి ప్రజల వినియోగానికి అంకితం చేశారు.

ఇది కూడా చదవండి: Lufthansa: AI ఎఫెక్ట్.. లుఫ్తాన్సాలో భారీగా ఉద్యోగాల కోత

పేరుమార్పు ఆవశ్యకత

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ఫ్లైఓవర్ పేరును మార్చాలని డిమాండ్లు వినిపించాయి. రాష్ట్ర ప్రత్యేకత, సంస్కృతిని ప్రతిబింబించేలా ‘తెలంగాణ తల్లి’ పేరుతో ఉండాలని పలు వర్గాలు కోరాయి.

తాజాగా జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన కీలక నిర్ణయం తీసుకుని, అధికారికంగా పేరుమార్పు ఆమోదం తెలిపింది. ఇకపై ఈ ఫ్లైఓవర్ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా ‘తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌’ పేరుతో కొనసాగనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *