Telangana News:

Telangana News: మంత్రి ప‌ద‌వి కోసం రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల పట్టు

Telangana News:మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ అంశం స‌మీపిస్తున్నా కొద్దీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆశ‌లు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే వివిధ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి డిమాండ్లు చేరుతుండ‌టంతో త‌ల‌నొప్పిగా మారింది. సామాజిక స‌మీక‌ర‌ణాలు, జిల్లాల ప్రాధాన్యాలపై అధిష్టానం మీన‌మేషాలు లెక్కిస్తున్న‌ది. ఈ ద‌శ‌లో రంగారెడ్డి జిల్లా నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏక‌మ‌య్యారు. త‌మ‌లో ఏవ‌రైనా ఒక‌రికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల్సిందేన‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. ఏకంగా వారంతా క‌లిసి అధిష్టానం పెద్ద‌ల‌ను క‌లిసి లేఖ‌లు అంద‌జేశారు.

Telangana News:ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లాలో 14 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు గాను నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మ‌ల్యేలు గెలుపొందారు. వారిలో మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్ర‌హీంప‌ట్నం), రామ్మోహ‌న్‌రెడ్డి (ప‌రిగి), మ‌నోహ‌ర్‌రెడ్డి (తాండూరు), గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్ (వికారాబాద్‌) ఉన్నారు. ఈ న‌లుగురిలో ఎవ‌రికిచ్చినా త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని తెలుపుతూ అధిష్టానానికి ఇచ్చిన లేఖ‌లో పేర్కొన్నారు. ఈ లేఖ‌పై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్ సంత‌కం కూడా ఉన్న‌ద‌ని వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దీంతో అటు అధిష్టానం, ఇటు రాష్ట్ర ముఖ్య నాయ‌క‌త్వం సందిగ్ధంలో ప‌డింది.

Telangana News:వాస్త‌వంగా ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలో హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిధ్యం లేదు. హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో త‌క్కువ ప్రాతినిథ్యం ఉన్న కార‌ణంగా, సీనియారిటీ ఉన్న లీడ‌ర్లు లేర‌న్న కార‌ణంతో మంత్రి మండ‌లిలోకి తీసుకోలేదు. సీనియారిటీ ఉన్న మాజీ మంత్రి అయిన గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్‌ను స్పీక‌ర్‌గా నియ‌మించారు.

Telangana News:త‌మ జిల్లాల ప్రాతినిథ్యం కోసం తొలి నుంచి మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రిగా త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌డుతూ వ‌స్తున్నారు. అయితే ఇప్ప‌టికే సీఎం నుంచి ఇత‌ర కీల‌క మంత్రి ప‌ద‌వుల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారు. మ‌లి విడ‌త మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లోనూ సుద‌ర్శ‌న్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డికి అవ‌కాశం ఇస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. ఈ ద‌శ‌లో మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ఆశ‌లు స‌న్న‌గిల్లాయి.

Telangana News:దీంతో ఇక లాభం లేద‌నుకొని రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలంతా ఒక‌టై ఏకంగా అధిష్టానానికి మొర‌పెట్టుకున్నారు. జిల్లా ఎమ్మెల్యేల లేఖ‌ను తీసుకొని మ‌ల్‌రెడ్డి రంగారెడ్డి ఢిల్లీలో అధిష్టానం పెద్ద‌ల‌ను క‌లిసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అధిష్టానం పున‌రాలోచిస్తే మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో మార్పులు చేర్పులు ఉండే అవ‌కాశం ఉన్న‌ద‌ని తెలుస్తున్న‌ది. ఈ ద‌శ‌లో ఒక‌వేళ రెడ్డి సామాజిక వ‌ర్గానికి ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో స్పీక‌ర్ గడ్డం ప్ర‌సాద్‌కుమార్‌ను మంత్రివ‌ర్గంలోకి తీసుకొని, స్పీక‌ర్‌గా మ‌రో సీనియ‌ర్‌కు అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచన చేసే అవ‌కాశ‌మూ లేక‌పోలేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో రేప‌టిలోగా క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ద‌ని పార్టీ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

ALSO READ  Ktr: పునర్విభజనలో కేరళకు అన్యాయం అయితది

కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ క‌ల‌క‌లం
Telangana News:రాష్ట్ర మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేల‌కు అవ‌కాశం క‌ల్పించాల‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత కే జానారెడ్డి ఆ పార్టీ అధిష్టానానికి రాసిన లేఖ సంచ‌ల‌నంగా మారింది. మంత్రి ప‌ద‌వి ఇవ్వాలంటూ ఆ జిల్లాల ఎమ్మ‌ల్యేల విజ్ఞ‌ప్తిని సానుకూలంగా ప‌రిశీలించాల‌ని ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్‌ను లేఖ‌లో జానారెడ్డి కోరిన‌ట్టు తెలిసింది. వారికి అవ‌కాశం క‌ల్పిస్తే ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాల‌కే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధికి దోహ‌ద‌ప‌డుతుంద‌ని జానారెడ్డి పేర్కొన్నార‌ని స‌మాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *