Fake Clinics: వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని నకిలీ డాక్టర్లు, క్లినిక్లపై దాడులు చేశారు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ శ్రీనివాస్, ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వారి బృందం.తనిఖీలలో ఆరు క్లినికులను అధికారులు సీజ్ చేశారు .రాఘవేంద్ర క్లినిక్, హనుమాన్ క్లినిక్, గ్లోబల్ క్లినిక్, గఫర్ క్లినిక్ ,పల్లవి క్లినిక్ లను సీజ్ చేసినట్లు తెలిపారు.కనీస విద్యా అర్హత లేకుండా టెన్త్, ఇంటర్ చదివి, ఎంబిబిఎస్ ప్రాక్టీస్ చేస్తున్న ఆరుగురు డాక్టర్లపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.NMC యాక్ట్ రూల్ 34, 54 కింద కేసు నమోదు చేసి సంవత్సరం ఇంప్రెయర్మెంట్, ఐదు లక్షల ఫైన్ విధించి లోఋల్ పోలీస్టేషన్ లో FIR తయారు చేస్తామని అన్నారు.
Fake Clinics: నకిలీ డాక్టర్లు ఏర్పాటు చేసిన ఒక్కో క్లినిక్ లో 8 నుంచి 10 బెడ్లు వేసి క్లీనిక్లను నడిపిస్తున్నట్లు తెలిపారు.తనిఖీ చేసిన ఐదు క్లినిక్ లకు DMHO పర్మిషన్, ఫార్మసీ పర్మిషన్ లేకుండా క్లినిక్ లు నడుపుతున్నారని అన్నారు.బయో మెడికల్ వేస్టేజీ డిస్పోస్ చేయాల్సిన అవసరం ఉంది.డిస్పోస్ చేయకుండా మున్సిపల్ వాహనంలో బయో మెడికల్ వేస్టేజ్ ని వేసి పంపిస్తున్నారని అన్నారు.వాటివల్ల జంతువులకు మూగ జీవులకు ఎంతో ప్రమాదం ఉంది అని అన్నారు. ఐవి యాంటీబయాటిక్ వాడి ప్రజల ప్రాణాలతో చెలగాడమాడుతున్నారని తెలిపారు.నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేస్తున్నట్లు అర్హత ఉన్న ఎంబిబిఎస్ డాక్టర్ల దగ్గర వైద్యం చేయించుకోవాలని ప్రజలకు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో నకిలీ వైద్యం అందిస్తున్న 300కు పైగా క్లినిక్లను సీజ్ చేశామని ,హైదరాబాద్ ,ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 50 కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు.