Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన సోమవారం (జూన్ 2) నాడు ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న ప్రజలు ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గన్‌పార్కు వద్ద సీఎం రేవంత్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.
Telangana Formation Day: జాతీయ పురోగతికి తెలంగాణ రాష్ట్రం కూడా కృషి చేస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవన సౌలభ్యాన్ని పెంచేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు దశాబ్ద కాలంగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మోదీ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
Telangana Formation Day: రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, జాతి ఒక్కటేనని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన, ప్రస్తుత ఏపీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయం వ్యక్తంచేశారు. తెలుగు వారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలని తాను కోరుకుంటానని చెప్పారు. తెలగాణలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో సాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు చంద్రబాబు చెప్పారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.